Manchu Lakshmi | టాలీవుడ్ స్టార్ బ్యూటీ మంచు లక్ష్మి ఎప్పుడూ తన ప్రత్యేకమైన స్టైల్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. తెలుగు, ఇంగ్లీష్ కలిపి ఆమె మాట్లాడే విధానం సోషల్ మీడియాలో తరచూ మీమ్స్‌గా మారుతూ ట్రెండ్ అవుతుంటుంది. తాజాగా ఆమె చేసిన మరో కామెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ సినిమా “పుష్ప” లో వినిపించిన ఫేమస్ డైలాగ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల “లేచింది మహిళా లోకం” అనే సినిమా ఈవెంట్లో మంచు లక్ష్మి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఫ్లవర్ అనుకున్నావా… ఫైర్!” అనే డైలాగ్ గురించి ప్రస్తావించారు.
“ఫ్లవర్ అనుకున్నావా… ఫైర్ అనేది మొదట నేనే చెప్పాను. ఆ డైలాగ్ నాదే. కావాలంటే పాత వీడియోలు చెక్ చేసుకోండి” అంటూ మంచు లక్ష్మి చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.నిజానికి చాలా సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ “నన్ను ఫ్లవర్ అనుకుంటారు కానీ నేను ఫైర్” అంటూ చెప్పిన వీడియో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ పాత వీడియోను షేర్ చేస్తూ ఆమె కామెంట్లపై చర్చిస్తున్నారు.
కొంతమంది నెటిజన్లు మంచు లక్ష్మి చెప్పింది నిజమేనని చెబుతుండగా, మరికొందరు మాత్రం దీనిపై సరదాగా మీమ్స్ తయారు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆమె చేసిన వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు మంచు లక్ష్మి. మొత్తం మీద తన మాటలతో ఎప్పుడూ చర్చలో ఉండే మంచు లక్ష్మి, ఈసారి “ఫ్లవర్ అనుకున్నావా… ఫైర్!” డైలాగ్ విషయంతో మళ్లీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.