Narketpally | నార్కట్‌పల్లిలో హైవేపై ఆగిన వాహనాలను ఢీకొట్టి లారీ.. ఇద్దరు బస్సు డ్రైవర్లు మృతి
Narketpally | నల్గొండ జిల్లా నార్గట్పల్లి వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేస్తున్న సమయంలో బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో రోడ్డు పక్కన వాహనాలను ఆపి మాట్లాడుకుంటుండగా.. మరో లారీ వచ్చి ఆగివున్న లారీని ఢీకొట్టింది.
Narketpally | నల్గొండ జిల్లా నార్గట్పల్లి వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేస్తున్న సమయంలో బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో రోడ్డు పక్కన వాహనాలను ఆపి మాట్లాడుకుంటుండగా.. మరో లారీ వచ్చి ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతిచెందగా.. బస్సు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో కాకినాడ వైపు వెళ్తున్న మోజో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ ఓవర్టేక్ చేసే క్రమంలో ఒకదానికొకటి స్వల్పంగా తగిలాయి. దీంతో రెండు వాహనాల డ్రైవర్లు పక్కన ఆపి మాట్లాడుకుంటున్నారు.
అది గమనించిన మరో ట్రావెల్ బస్సు కూడా అక్కడ ఆపారు. ఆ బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్య వచ్చి గొడవ గురించి చర్చించారు. ఇంతలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ.. అతివేగంతో దూసుకొచ్చి ఆపివున్న లారీని ఢీకొట్టింది. దీంతో నలుగురు వ్యక్తులు రెండు లారీల మధ్య నలిగిపోయారు.
ఈ ఘటనలో రెండో బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మొదటి బస్సు క్లీనర్ సురేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ల మృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. ఇక మూడు వాహనాలను పోలీసులు స్టేషన్‌కు తరలించి, రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Read More :
Arms Importer | ఆయుధాల దిగుమతుల్లో భారత్ నం.2.. నంబర్ వన్ ఏ దేశమంటే..!
Degree Credits | డిగ్రీ క్రెడిట్స్‌కు కోత.. 142 నుంచి 120 వరకు కుదింపు?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

