Degree Credits | డిగ్రీ క్రెడిట్స్‌కు కోత.. 142 నుంచి 120 వరకు కుదింపు?
Degree Credits | రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లోని క్రెడిట్స్‌కు కోతపడనున్నది. క్రెడిట్స్‌ను 142 నుంచి 120కి తగ్గించనున్నారు. కొన్ని పాఠ్యాంశాలను తొలగించడమే కాకుండా, సిలబస్‌ను తగ్గించనున్నారు. డిగ్రీ కోర్సుల క్రెడిట్స్‌ను తగ్గించేందుకు ఓ కమిటీని నియమించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు.
Degree Credits | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లోని క్రెడిట్స్‌కు కోతపడనున్నది. క్రెడిట్స్‌ను 142 నుంచి 120కి తగ్గించనున్నారు. కొన్ని పాఠ్యాంశాలను తొలగించడమే కాకుండా, సిలబస్‌ను తగ్గించనున్నారు. డిగ్రీ కోర్సుల క్రెడిట్స్‌ను తగ్గించేందుకు ఓ కమిటీని నియమించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు.
కమిటీ సూచనల మేరకు క్రెడిట్స్‌ను తగ్గించబోతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఏడాదికి 142 క్రెడిట్స్ ఉన్నాయని, రెండు సెమిస్టర్లుండగా, 22 క్రెడిట్స్‌ను తగ్గించనుండటంతో సెమిస్టర్‌కు 11 చొప్పున క్రెడిట్స్ తగ్గించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీంతో సిలబస్‌ను కూడా తగ్గిస్తామని, కొన్ని పాఠ్యాంశాలు తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్రెడిట్స్‌ను తగ్గించిన తర్వాత అన్ని వర్సిటీల్లో కామన్ క్రెడిట్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ 11 కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
2026-27 విద్యాసంవత్సరంలో ఈ కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. కోర్సులను నిర్వహించేందుకు ఆసక్తి గల కాలేజీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరిన వారి కోసం ప్రత్యేక రీడింగ్ మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బోధనకు ఏఐ సాంకేతికత వినియోగిస్తామని వెల్లడించారు. కొత్త కోర్సులను నిర్వహించేందుకు ఆసక్తి గల కాలేజీలు 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
కొత్త కోర్సులివే..
- ఎంఏ అడ్వాన్స్డ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్
- ఎంఏ ల్యాండ్ గవర్నెన్స్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్
- ఎంఏ అడ్వాన్స్డ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్
- ఎంఏ మారిటైమ్ టెక్నాలజీ అండ్ మారిటైమ్ గవర్నెన్స్
- ఎంఏ ట్రావెల్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్
- ఎంఏ అడ్వాన్స్డ్ ఎయిర్పోర్ట్, ఎయిర్‌లైన్స్, ఎయిర్‌స్పేస్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్
- ఎంకాం ఫైనాన్స్ టెక్నాలజీ అండ్ ఎమర్జింగ్ చాలెంజెస్
- ఎమ్మెస్సీ ైక్లెమేట్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్
- ఎమ్మెస్సీ మెడికల్ మైక్రో బయాలజీ
- ఎమ్మెస్సీ మెడికల్ ఇమ్యునాలజీ
- ఎమ్మెస్సీ సైబర్ సెక్యూరిటీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

