న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025 ఫలితాల్లో 301 ర్యాంక్‌పై యూపీఎస్సీ సోమవారం స్పష్టత ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అభయ్‌పూర్ గ్రామానికి చెందిన ఆకాంక్ష సింగ్ (రోల్ నెం.0856794)కు మాత్రమే 301 ర్యాంక్ వచ్చిందని వెల్లడించింది.
బీహార్‌కు చెందిన ఆకాంక్ష సింగ్ అనే పేరు గల యువతి ఆన్లైన్లో ఉంచిన యూపీఎస్సీ అడ్మిట్ కార్డ్, ఇతర పత్రాలు చట్ట విరుద్ధమైనవని యూపీఎస్సీ తన దర్యాప్తులో తేల్చింది. ఆమె అడ్మిట్ కార్డ్‌లో తన రోల్ నం.0856794గా, బార్ కోడ్‌లో అదే రోల్ నంబర్‌ను 0856569గా పేర్కొన్నదని తెలిపింది. నిజమైన 301 ర్యాంక్ హోల్డర్ చిరునామాను, ఆమె తల్లిదండ్రుల పేర్లను యూపీఎస్సీ ఎక్స్‌లో షేర్ చేసింది.