Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Points Gun | గ్యాస్ స్టేషన్ సిబ్బందితో ఒక కుటుంబం వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి చెందిన మహిళ గ్యాస్ స్టేషన్ వ్యక్తి ఛాతిపై గన్ గురిపెట్టింది. నీ కుటుంబం గుర్తుపట్టలేనంతగా బుల్లెట్లతో కాల్చేస్తానని బెదిరించింది.
లక్నో: గ్యాస్ స్టేషన్ సిబ్బందితో ఒక కుటుంబం వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి చెందిన మహిళ గ్యాస్ స్టేషన్ వ్యక్తి ఛాతిపై గన్ గురిపెట్టింది. (Woman Points Gun) నీ కుటుంబం గుర్తుపట్టలేనంతగా బుల్లెట్లతో కాల్చేస్తానని బెదిరించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం ఒక కుటుంబం కారులో సీఎన్జీ రీఫిల్ కోసం గ్యాస్ స్టేషన్‌కు చేరుకున్నది.
కాగా, సీఎన్జీ ఫిల్ చేస్తున్న సిబ్బంది భద్రత దృష్ట్యా కారులో ఉన్న వారిని బయటకు రావాలని సూచించాడు. అయితే కారు దిగిన ఎహ్సాన్ ఖాన్, గ్యాస్ స్టేషన్ సిబ్బంది రజనీష్ కుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. మీదకు వెళ్లడంతో ఆ వ్యక్తి చేతితో తోశాడు. ఇది చూసి ఖాన్ కుమార్తె అరిబా ఆగ్రహించింది. వెంటనే కారు వద్దకు వెళ్లి రివాల్వర్ తెచ్చింది. గ్యాస్ స్టేషన్ సిబ్బంది రజనీష్ కుమార్ ఛాతికి గురిపెట్టింది. నీ కుటుంబం నిన్ను గుర్తుపట్టలేనంతగా చాలా బుల్లెట్లతో కాల్చేస్తానని బెదిరించింది. అక్కడున్న వారు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. దీంతో ఆ కుటుంబం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరోవైపు గ్యాస్ స్టేషన్ సిబ్బంది రజనీష్ కుమార్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఖాన్ కుటుంబాన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడి పేరుతో రిజిస్టర్ అయిన లైసెన్స్ ఉన్న ఆ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నమోదు చేస్తున్నారు. కాగా, గ్యాస్ స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The lady with the gun is Ariba Khan. She threatened a salesman with a revolver because he asked her to step out of the car during CNG refueling (As per rule).
Yet the ecosystem keeps propagating that Muslims are living under threat in India. What more freedom do they want? pic.twitter.com/ioL01pIZc8
— Mr Sinha (@MrSinha_) June 16, 2025
Also Read:
Watch: జిప్‌లైన్‌పై వేలాడుతూ వెళ్తున్న బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భారీ వర్షానికి కూలిన ప్రహరీ గోడ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: జిప్‌లైన్‌పై వేలాడుతూ వెళ్తున్న బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

