సిమ్లా: పదేళ్ల బాలిక జిప్‌లైన్‌పై వేలాడుతూ వెళ్తుండగా బెల్ట్ తెగిపోయింది. (zipline belt breaks) దీంతో 30 అడుగుల లోయలో ఆమె పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్ల బిజ్వే, తన భార్య, కుమార్తెతో కలిసి వేసవి సెలవులకు విహారయాత్రగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు.
కాగా, జూన్ 8న పదేళ్ల త్రిషా బిజ్వే మనాలిలోని జిప్లైనింగ్పై వేలాడుతూ వెళ్లింది. అయితే ఆమె గాలిలో ఉండగా సేఫ్టీ బెల్ట్ తెలిపోయింది. దీంతో సుమారు 30 అడుగుల లోయలో ఆ బాలిక పడిపోయింది. కాళ్లు విరగడంతోపాటు ఆమె తీవ్రంగా గాయపడింది. త్రిషాకు తొలుత మనాలిలో వైద్య సహాయం అందించారు. ఆ తర్వాత చండీగఢ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందున్నది.
మరోవైపు తమ కుమార్తె త్రిషా పరిస్థితి విషమంగా ఉన్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. జిప్‌లైన్ నిర్వాహకులు తగిన భద్రతా విధానాలు పాటించలేదని ఆరోపించారు. జిప్‌లైన్ ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత తక్షణ సహాయం అందలేదని విమర్శించారు. కాగా, జిప్‌లైన్ బెల్ట్ తెగడంతో ఆ బాలిక ఎత్తు నుంచి కింద పడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
HP : मनाली में जिप लाइन टूटने से नागपुर की त्रिशा 30 फीट गहरी खाई में जा गिरी। वो घायल है और अस्पताल में इलाज चल रहा है। pic.twitter.com/mtO3zTubHk
— Sachin Gupta (@SachinGuptaUP) June 15, 2025
Also Read:
Watch: రోడ్డు దాటుతున్న గుర్రాన్ని ఢీకొట్టిన బైక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Bride Calls Off Marriage | సిందూర్ సమయంలో వణికిన వరుడి చేయి.. పెళ్లి రద్దు చేసిన వధువు