Donald Trump | అందుకే రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్‌కు అనుమతి : డొనాల్డ్ ట్రంప్
Donald Trump | ఇరాన్ (Iran) తో యుద్ధం తీవ్రమైన వేళ రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇటీవల భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా (USA) తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (US President Trump) మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump : ఇరాన్ (Iran) తో యుద్ధం తీవ్రమైన వేళ రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇటీవల భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా (USA) తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (US President Trump) మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంవల్ల పశ్చిమాసియా, గల్ఫ్‌లో చమురు సరఫరా మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందని అన్నారు.
అందుకే ప్రపంచ దేశాల్లోని ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గించడానికి భారత్‌కు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అందులో భాగంగానే సముద్రంలో ఇప్పటికే ఉన్న రష్యా ముడి చమురును కొనుగోలు చేయడానికి భారత్‌కు 30 రోజుల మినహాయింపు ఇచ్చామని ట్రంప్ వివరించారు. దీనివల్ల రష్యాకు ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు.
ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి అదనపు చర్యల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మేరకు ఒత్తిడి తగ్గించే విషయం గురించి మాత్రమే తాను ఆలోచిస్తున్నానని అన్నారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ప్రపంచ సరఫరా బలంగా ఉందని పేర్కొన్నారు. అమెరికా వద్ద అపారమైన చమురు నిల్వలు ఉన్నాయని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

