పాట్నా: పెళ్లి తంతులో భాగంగా వధువు నుదుటపై సిందూర్ పెట్టే సమయంలో వరుడి చేయి వణికింది. దీంతో అతడు పిచ్చివాడని వధువు ఆరోపించింది. ఆ వ్యక్తితో పెళ్లిని రద్దు చేసింది. (Bride Calls Off Marriage) ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్కు చేరాయి. బీహార్లోని కైమూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వరుడు తన కుటుంబం, బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. పెళ్లి తంతు ప్రారంభమైంది. వివాహానికి సంబంధించిన అన్ని ఆచారాలు పూర్తయ్యాయి.
కాగా, పెళ్లిలో అతి ముఖ్యమైన ఆచారం ‘సిందూర్ దాన్’. వధువు నుదుటపై సిందూరం పెట్టే సమయంలో వరుడి చేయి వణికింది. వధువు ఇది గమనించింది. దీంతో ఆగ్రహించిన ఆమె పెళ్లి తంతు కొనసాగించేందుకు నిరాకరించింది. ఆ అబ్బాయి పిచ్చివాడని అతడ్ని పెళ్లి చేసుకోనని తన తల్లిదండ్రులకు చెప్పింది. వరుడు, అతడి కుటుంబ సభ్యులు వధువుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కట్నం కింద ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లికూతురు తండ్రి డిమాండ్ చేశాడు. అయితే పెళ్లి కోసం ఖర్చులు అయ్యాయని వరుడి తండ్రి వాదించాడు.
మరోవైపు ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. పోలీసులు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే పెళ్లి తంతు కొనసాగేందుకు వధువు నిరాకరించింది. దీంతో వరుడు తన కుటుంబంతో కలిసి తన ఊరికి వెళ్లిపోయాడు. ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
वो पागल है, मैं शादी नहीं करूंगी: शादी के सिंदूर दान की रस्स के दौरान दूल्हा का हाथ हिल गया और इसके बाद लड़की ने शादी से इनकार कर दिया. लड़की ने कहा कि लड़का पागल है.#kaimur #Bihar #BiharNews pic.twitter.com/rCtE68R2VI
— FirstBiharJharkhand (@firstbiharnews) June 9, 2025
Also Read: