న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌కు నేతృత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (Lt General Rajiv Ghai), డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ)గా సోమవారం నియమితులయ్యారు. అయితే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) పదవిలో కూడా ఆయన కొనసాగుతారు. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ) అనేది ఆర్మీ ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్లను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కొత్త విభాగం. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం ఇండియన్ ఆర్మీలోని అత్యంత కీలకమైన నియామకాలలో ఇది ఒకటి.
కాగా, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్‌లోని కీలక వైమానిక స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణ కోసం పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) కోరారు. భారత డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో మే 10న భారత్, పాక్ మధ్య కాల్పుల ఒప్పందం అమలులోకి వచ్చింది.
మరోవైపు ఆపరేషన్ సిందూర్‌లో విశిష్ట సేవలను గుర్తిస్తూ జూన్ 4న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెర్మనీ 2025 (ఫేజ్-II) సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌కు ఉత్తమ యుద్ధ సేవా మెడల్ కూడా లభించింది.
Also Read: