Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న కంటైనర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమవ్వగా.. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న కంటైనర్ను ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు నిడదవోలు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
బస్సు ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.