జైపూర్: ఒక వృద్ధ జంట 70 ఏళ్లుగా సహజీవనం చేశారు. (70 years of live-in relationship) ఎనిమిది మంది పిల్లలను కని పెద్ద చేశారు. జీవితం చివరి దశలో ఉన్న ఈ వృద్ధ జంట చివరకు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గలందర్ గ్రామానికి చెందిన 95 ఏళ్ల రామా భాయ్ అంగారి, 90 ఏళ్ల జీవాలి దేవి 70 ఏళ్లుగా సహజీవనం చేశారు. ఎనిమిది మంది పిల్లలను కని పెంచారు. నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు జీవితంలో స్థిరపడటంతో పాటు పెళ్లిళ్లు చేసుకున్నారు.
కాగా, పెద్ద కుమారుడైన 60 ఏళ్ల బాకు అంగారి రైతు. రెండో కుమారుడైన 55 ఏళ్ల శివరామ్, మూడో కుమారుడైన 52 ఏళ్ల కాంతిలాల్ (52) ఉపాధ్యాయులు. నాలుగో కుమారుడైన 52 ఏళ్ల లక్ష్మణ్ కూడా రైతుగా పనిచేస్తున్నాడు. వృద్ధ జంట కుమార్తెలు సునీత టీచర్‌గా, అనిత నర్సుగా స్థిరపడ్డారు. వీరందరికి పెళ్లిళ్లు జరుగడంతోపాటు పిల్లలు కూడా ఉన్నారు.
మరోవైపు రామా భాయ్, జీవాలి దేవి ఇంత వరకు అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. అయితే జీవితం చివరి దశలో ఉన్న ఈ జంట తమ సంబంధాన్ని గిరిజన సాంప్రదాయ ఆచారాలతో పెళ్లి బంధంగా చేసుకోవాలని భావించింది. దీనికి వారి కుమారులు, కుమార్తెలు మద్దతివ్వడంతోపాటు ఘనంగా పెళ్లి జరిపించారు.
కాగా, హల్టీ, మెహందీతోపాటు డీజే డ్యాన్సులు, సంప్రదాయ నృత్యాలు, ఊరేగింపు, విందు వంటి కార్యక్రమాలతో ఈ వృద్ధ జంట పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. గ్రామస్తులు కూడా ఎంతో ఉత్సహంతో ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. 70 ఏళ్లుగా కలిసి జీవించి నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచి పెళ్లితో ఒక్కటైన ఈ వృద్ధ జంటను ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
70 साल लिव-इन रिलेशनशिप के बाद बुजुर्ग-जोड़े ने रचाई शादी: 95 साल के दूल्हे और 90 साल की दुल्हन के 8 बच्चे; बिंदौरी में बेटे-पोते नाचेhttps://t.co/rTWdfp2HuY#Rajasthan #Jaipur #Marriage pic.twitter.com/mthGCDr5Am
— Dainik Bhaskar (@DainikBhaskar) June 5, 2025
Also Read: