తిరువనంతపురం: సింగపూర్‌కు చెందిన కంటైనర్ షిప్లో పేలుడు సంభవించింది. (Explosion On container ship) దట్టంగా పొగలతోపాటు మంటలు ఎగసిపడ్డాయి. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. సోమవారం ఉదయం కేరళ తీరంలో సింగపూర్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ ఎంవీ వాన్ హై 503లో పేలుడు సంభవించింది. ముంబైలోని మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా కొచ్చిలోని మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్‌కు సమాచారం అందినట్లు రక్షణ శాఖ తెలిపింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ నేవీ రంగంలోకి దిగినట్లు చెప్పింది. కొచ్చిలో ఉన్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్‌ను ఆ కంటైనర్ షిప్ వద్దకు పంపినట్లు వెల్లడించింది.
కాగా, 12.5 మీటర్ల వెడల్పు, 270 మీటర్ల పొడవున్న ఈ కంటైనర్ షిప్ జూన్ 7న కొలంబో నుంచి బయలుదేరింది. జూన్ 10న ముంబైకు చేరుకోవాల్సి ఉన్నది. అయితే సోమవారం ఉదయం 10.30 గంటలకు షిప్ డెక్ కింద నుంచి పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో అందులో ఉన్న 22 మంది సిబ్బందిలో 18 మంది ఆ నౌకను వీడి బోటులో ప్రయాణించారు. ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ దళాలు
వీరిని రక్షించాయి.
మరోవైపు మంటల్లో చిక్కుకున్న సింగపూర్ కంటైనర్ షిప్ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. నేవీ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.
#Update
Of the 22 crew, 18 crew have abandoned the ship on boat.
Crew being rescued by CG and IN assets.
Vessel is presently on fire and adrift.@indiannavy @IndiaCoastGuard @IN_HQSNC @IN_WNC pic.twitter.com/5Uqskt0iHJ— PRO Defence Kochi (@DefencePROkochi) June 9, 2025
Also Read: