ఇండోర్: మేఘాలయా మర్డర్(Honeymoon Murder) కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. ఇండోర్‌కు చెందిన కొత్త జంట .. హనీమూన్‌కు వెళ్లి మిస్సైన విషయం తెలిసిందే. భర్త రాజా రఘువంశీనీ .. భార్యే హత్య చేయించినట్లు మేఘాలయా పోలీసులు చెబుతున్నారు. సోనమ్‌కు వివాహేతర సంబంధం ఉందని, దాని వల్ల ఆమె కాంట్రాక్టు హంతకులతో భర్తను హత్య చేయించి ఉంటుందని మేఘాలయా పోలీసులు పేర్కొన్నారు.
రఘువంశీ, సోనమ్‌లు మే 23వ తేదీన చిరంపుంజి వద్ద మిస్సైయ్యారు. వారం రోజుల తర్వాత రాజా మృతదేహాన్ని ఓ లోయలో గుర్తించారు. కానీ సోనమ్ కోసం వేట కొనసాగింది. వారం తర్వాత ఆమె తన స్వంత ఊరిలో ప్రత్యక్షమైంది. రాజా రఘువంశీ మర్డర్‌కు వివాహేతర సంబంధమే కారణమని మేఘాలయా పోలీసులు నమ్ముతున్నారు. బాయ్‌ఫ్రెండ్ రాజ్ కుశ్వాతో కలిసి భర్త మర్డర్‌కు ఆమె ప్లాన్ చేసిందన్నారు. కానీ కేసు వత్తిడి వల్ల జూన్ 8వ తేదీన వాళ్లు సరెండర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో సోనమ్ భాయ్‌ఫ్రెండ్ రాజ్ కుష్వా గురించి బాధిత కుటుంబీకులు మౌనం వీడారు. సోనమ్ వద్ద రాజ్ పనిచేసేవాడని, వాళ్లు ఎక్కువగా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు అని రఘువంశీ సోదరుడు విపుల్ పేర్కొన్నారు. కానీ రాజ్ కుష్వాను ఎప్పుడూ చూడలేదని, కేవలం అతని గురించి విన్నట్లు విపుల్ తెలిపాడు. బహుశా రఘువంశీ మర్డర్ కేసులో సోనమ్ పాత్ర ఉండి ఉంటుందని విపుల్ తెలిపారు.
కొత్త జంట ముందుగా గౌహతిలోని కామాఖ్యా ఆలయానికి వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ ప్లాన్‌ను మార్చుకుని ఎందుకు మేఘాలయా వెళ్లారో తెలియదని విపుల్ తెలిపాడు. హనీమూన్‌కు వెళ్లిన జంట అదృశ్యమైనా.. సోనమ్ ఎలా బ్రతికి ఉందన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మే 11వ తేదీన రాజా, సోనమ్‌లు పెళ్లి చేసుకున్నారు. మే 20వ తేదీన వాళ్లు హనీమూన్‌కు వెళ్లారు. ఆ తర్వాత రోజు వాళ్లు షిల్లాంగ్‌లో కనిపించారు. మే 23వ తేదీన పాపులర్ పిక్నిక్ స్పాట్‌కు వెళ్లారు.
జూన్ రెండో తేదీన రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ ఓ మచ్చుకత్తి దొరికింది. కానీ జూన్ 8వ తేదీ వరకు సోనమ్ ఆచూకీ చిక్కలేదు. చివరకు యూపీలో ఓ దాబా వద్ద ఆమెను పట్టుకున్నారు.
Also Read..