యాదాద్రి భువనగిరి, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రైతులకు సకాలంలో యూరియా అందించాలని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఖాళీ యూరియా బస్తాలను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా యూరియా యాప్ తీసుకొచ్చి అవస్థలపాలు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.