సెయింట్ లూయిస్ (యూఎస్ఏ): సింక్ఫీల్డ్ కప్‌లో ప్రజ్ఞానంద రెండో విజయం అందుకున్నాడు. మూడో రౌండ్లో ఎదురైన ఓటమి నుంచి వెంటనే తేరుకున్న ఈ భారత గ్రాండ్‌మాస్టర్ శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్లో జోర్డెన్ వాన్ ఫోరెస్ట్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు.
తెల్లపావులతో ఆడుతూ 71 ఎత్తుల్లో మ్యాచ్‌ను ముగించాడు. నాలుగో రౌండ్లో మిగిలిన గేమ్‌లన్నీ డ్రాగానే ముగిశాయి. ఇక ఈ విజయంతో ప్రజ్ఞా.. 2.5 పాయింట్లతో అరోనియన్ (యూఎస్ఏ)తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అమెరికా జీఎం వెస్లీ (3) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.