ఘాజిపూర్: మేఘాలయాలో జరిగిన మర్డర్(Honeymoon Murder) కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకున్నది. ఇండోర్‌కు చెందిన జంట హనీమూన్‌కు వెళ్లగా.. భార్యాభర్తలు మిస్సయ్యారు. అయితే భర్త సోనమ్ రఘువంశీ .. ఓ లోయలో శవమై తేలాడు. భార్య సోనమ్ గురించి మేఘాలయా పోలీసులు దర్యాప్తు చేసి ఆమెను యూపీలో పట్టుకున్నారు. కానీ తన కూతురు అమాయకురాలు అని సోనమ్ తండ్రి దేవీ సింగ్ మీడియాతో పేర్కొన్నాడు. మేఘాలయా ప్రభుత్వం కట్టుకథలు చెబుతోందన్నారు. అబద్దాలు, తప్పుడు కథనాలతో తన కూతుర్ని వేధిస్తోందన్నాడు.
యూపీలోని ఘాజిపూర్లో దాబాకు చేరుకున్న సోనమ్‌ను పోలీసులు నిర్బంధించారు. సోనమ్‌తో పాటు మరో ముగ్గురు కలిసి రఘువంశీని మర్డర్ చేసి ఉంటారని మేఘాలయా పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ సోనమ్ తండ్రి మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. తన కూతురు అమాయకురాలు అని, తన కుతురిపై తనకు నమ్మకం ఉందని, ఆ మర్డర్ ఆమె చేసి ఉండదని, రెండు కుటుంబాల అంగీకారంతో పెళ్లి జరిగిందని, మేఘాలయా ప్రభుత్వం ముందు నుంచి అబద్దాలు చెబుతోందని, ఆదివారం రాత్రి ఘాజీపూర్‌లో దాబాకు వచ్చిన సోమన్ సోదరుడికి ఫోన్ చేసిందని, ఆ దాబాకు వెళ్లిన పోలీసులు ఆమెను అక్కడ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారని, కూతురితో ఇంకా మాట్లాడలేదని, ఆమె ఎందుకు ఇలా చేస్తుందని తండ్రి ప్రశ్నించాడు.
మేఘాలయా పోలీసులు అబద్దం చెబుతున్నారని, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని దేవీ సింగ్ డిమాండ్ చేశాడు. మేఘాలయాలో తన కూతుర్ని అరెస్టు చేయలేదని, మధ్యప్రదేశ్ సీఎంతో పాటు హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు అతను తెలిపాడు.
Also Read..