Bengaluru Stampede | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం తొక్కిసలాట (Bengaluru Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మరణించగా మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు (magisterial inquiry) కర్ణాటక ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఘటనలో గాయపడిన 45 మందికి బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. జూన్ 11న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. గాయపడిన వారు ఈనెల 11న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య బెంగళూరులోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న మెజిస్టీరియల్ కోర్టు ఆడిటోరియానికి చేరుకొని తమ వాంగ్మూలాలను నమోదు (Record Statements) చేసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఆర్సీబీ (RCB) విజయోత్సవ వేడుక సందర్భంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 47 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ విషాద ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొక్కిసలాటకు కారణాలేంటి? తలెత్తిన లోపాలు, జవాబుదారీతనం వంటి అంశాలను పరిశీలించేందుకు డిప్యూటీ కమిషనర్, బెంగళూరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ 15 రోజుల్లోగా విచారణ చేస్తారని ప్రభుత్వం తెలిపింది.
Also Read..
IED blast | మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి అదనపు ఎస్పీ మృతి
Overcrowded Local Train | రైల్లో నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి
Honeymoon Couple | భర్తను భార్యే హత్య చేయించింది.. వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ