Overcrowded Local Train | మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో ఘోర ప్రమాదం సంభవించింది. అధిక రద్దీ కారణంగా లోకల్ ట్రైన్ నుంచి (Overcrowded Local Train) జారిపడి ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
లోకల్ ట్రైన్ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్‌కు వెళ్తుండగా ముంబ్రా, దివా రైల్వే స్టేషన్ల (Diva railway stations) మధ్య ఈ సంఘటన జరిగినట్లు రైల్వే అధికారులు (Railway officials) తెలిపారు. అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు రైలు డోర్స్ వద్ద వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పది నుంచి 12 మంది ప్రయాణికులు జారి పట్టాలపై పడ్డారు. అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Honeymoon Couple | వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ.. భర్తను భార్యే హత్య చేయించింది
Ghaziabad | ఆర్డర్ ఆలస్యం అయ్యిందని రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు..