మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి రంగం సిద్ధం!
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 46లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.
- టీ-డయాగ్నొస్టిక్స్ ద్వారా ఒక్కొక్కరికీ 30 రకాల పరీక్షలు : రాజనర్సింహ
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 46లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ ప్రొగ్రామ్‌ను ప్రారంభించనున్నట్టు వివరించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ సహకారంతో ఒక్కో మహిళకు మొత్తం 30 రకాల పరీక్షలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొత్తం 4 దశల్లో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
తొలి దశలో ఈనెల 6 నుంచి 31 వరకు మాతా శిశు సంరక్షణ, కౌమర దశ బాలికలు, వృద్ధులకు, రెండో దశలో ఏప్రిల్ 1 నుంచి 15 వరకు అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వాటిని గుర్తించేందుకు సబ్ సెంటర్ల పరిధిలో విస్తృతమైన స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. మూడో దశలో ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య సన్నద్ధతపై యంత్రాంగం దృష్టి సారించినట్టు స్పష్టంచేశారు. మే 16 నుంచి జూన్ 12 వరకు నాలుగో దశలో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మేడ్చల్ పరిధిలోని 145 అర్బన్ పీహెచ్‌సీలను పాలిక్లినిక్స్‌గా అప్‌గ్రేడ్ చేసి, స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని మంత్రి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

