అలా రాసినప్పుడే పాటకు సార్థకత!
‘పెద్ది’ చిత్రంలో ఇటీవల విడుదలైన ‘రై రై రారా’ పాటకు మంచి స్పందన లభిస్తున్నది. ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రచించారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘పెద్ది’ చిత్రంలో ఇటీవల విడుదలైన ‘రై రై రారా’ పాటకు మంచి స్పందన లభిస్తున్నది. ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రచించారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం గీత రచయిత అనంత శ్రీరామ్ విలేకరులతో ముచ్చటించారు.
ఈ పాట తాలూకు చర్చల్లో ప్రబోధాత్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. లోతైన భావాల్ని చెబుతూనే వ్యవహారిక భాషలో పాట ఉండాలని దర్శకుడు బుచ్చిబాబు సానా సూచించారు. అందుకు తగినట్లుగానే మిత్ర సంహిత అనే ప్రక్రియలో పాట రాశాను. ఈ పాట వింటున్నప్పుడు స్నేహితులిద్దరూ కలిసి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది.
నా దృష్టిలో సినిమా పల్లకిని పాట మోయాలి. అప్పుడే పాటకు ప్రయోజనం. అందుకే ఈ పాటను శ్రీశ్రీ గేయ కవితలా రాశాను. శ్రీశ్రీ కవితలు చదువుతున్నప్పుడు ఎలాంటి ఉద్వేగం ఉంటుందో అలాంటి ప్రాసలతో ఈ పాట రాశాను.
మాస్ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడం కత్తిమీద సాములా అనిపించింది. అందుకే ఈ పాట రాయడానికి రెండు నెలలు కసరత్తులు చేశాను. ఒక పాట రాస్తే..ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన వారు వాటిని విరమించుకునేలా ప్రేరణ కలిగించాలి. అలాంటి పాట రాసినప్పుడు నా రచన సార్థకమైనట్లు భావిస్తాను. అలాంటి లక్షణాలు ఈ పాటలో ఉన్నాయనుకుంటున్నా. ఈ పాట విన్న రామ్‌చరణ్ నన్ను హత్తుకొని అభినందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

