యశ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని జూన్ 4కు వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
‘టాక్సిక్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌లోనూ విడుదల చేయాలనుకున్నామని, ప్రస్తుత యుద్ధ సమయంలో రిలీజ్ సరైన నిర్ణయం కాదని భావిస్తూ వాయిదా వేశామని నిర్మాణ సంస్థ ప్రకటనటలో తెలిపింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది.