HC Balakrishna | ‘గ్యారెంటీలు’ లేకుంటే బాగుండు.. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
HC Balakrishna | ‘ఐదు గ్యారెంటీలు లేకపోయి ఉంటే బాగుండు’ అంటూ తాజాగా మంత్రి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. గృహలక్ష్మి స్కీమ్‌ని ఎత్తేయాలని మరో పార్టీ నేత సలహా ఇచ్చారు.
HC Balakrishnaబెంగళూరు, సెప్టెంబర్ 27: గ్యారెంటీలంటూ హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ గ్యారెంటీలను అమలుచేయలేం బాబోయ్ అంటూ లబోదిబోమంటున్నది. గద్దెనెక్కి మూడేండ్లు కావొస్తున్నా ఇప్పటికీ గ్యారెంటీలను పూర్తిగా అమలుచేయని హస్తం పార్టీ.. అరకొరగా అమలు చేస్తున్న వాటినీ అటకెక్కించేందుకు సిద్ధమవుతున్నది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘ఐదు గ్యారెంటీలు లేకపోయి ఉంటే బాగుండు’ అంటూ తాజాగా మంత్రి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. గృహలక్ష్మి స్కీమ్‌ని ఎత్తేయాలని మరో పార్టీ నేత సలహా ఇచ్చారు. అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలుచేయలేక చేతులెత్తేయడంపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాబ్బాబు.. అర్థం చేసుకోండి..
తమపై ఐదు ప్రధాన గ్యారెంటీ పథకాల భారం కనుక లేకపోయి ఉంటే ఆర్థిక వ్యవహారాల నిర్వహణ చాలా సులభంగా ఉండేదని కర్ణాటక మంత్రి హెచ్‌సీ బాలకృష్ణ పేర్కొన్నారు. మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా ఉన్న బాలకృష్ణ.. డిమాండ్ల సాధనకు రామనగరలో ఆందోళన చేస్తున్న దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు, జీతభత్యాలు, అభివృద్ధి పనుల వ్యయం మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉందని పేర్కొన్నారు. ‘మేమే కనుక ఈ ఐదు గ్యారెంటీలు ఇవ్వకపోయి ఉంటే, బహుశా ఆర్థికంగా మాకు ఇన్ని పెద్ద సమస్యలు వచ్చి ఉండకపోవచ్చు. ఇవన్నీ మేం చాలా సులభంగా చేసే వాళ్లం. కానీ ప్రభుత్వాన్ని నడపాలి. ప్రతీపనిని వ్యవస్థలో భాగంగా, బడ్జెట్ పరిధిలో చేయాలి’ అని ఆందోళన చేస్తున్న దివ్యాంగులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఆందోళనకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తాను అర్థం చేసుకోగలనని, పథకాల భారంతో కునారిల్లుతున్న ప్రభుత్వ ఆర్థిక పరిమితుల గురించి కూడా వారు ఆలోచించాలని మంత్రి పేర్కొన్నారు.
సమస్యల్లో చిక్కుకున్నాం..
‘ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూడండి. ప్రతీదీ మేం నిర్వహించుకోవాలి. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. మాకు కూడా పలు పరిమితులు ఉన్నాయి’ అని మంత్రి బాలకృష్ణ అన్నారు. ‘మేం ప్రజల సంక్షేమం కోసమే ఈ గ్యారెంటీ ఇచ్చాం. ఒక వేళ రాష్ట్రంలో కరువు ఏర్పడితే రైతులకు సహాయం అందించాలి. లేకపోతే వారు కూడా ఆందోళనలు చేయవచ్చు’ అని తెలిపారు. అలాగే ఇప్పటివరకు గ్యారెంటీ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు కూడా నిరసనలు తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. మేమంతా ఈ సమస్యల మధ్య చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నామని ఆయన తెలిపారు.
అదే సమయంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలను నిలిపివేసే ఉద్దేశం ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పరిస్థితిని గురించి అర్థం చేసుకోవాలని, ఆర్థిక ఇబ్బందుల గురించి ఇస్తున్న వివరణను తమకు కష్టాలు కలిగించే ప్రయత్నంగా భావించ వద్దని ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిప్పనప్ప కమక్నూర్ కౌన్సిల్లో మాట్లాడుతూ ప్రభుత్వానికి భారంగా మారిన గృహలక్ష్మి గ్యారెంటీ పథకాన్ని ఎత్తివేయాలని కోరారు. తాజాగా మంత్రి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పకనే చెబుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

