Khairatabad By Elections | ‘సర్’కు తొలి పరీక్ష ఖైరతాబాద్.. ఉప ఎన్నికకు రంగం సిద్ధం
Khairatabad By Elections |రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ తొలి పరీక్షకు సిద్ధమవుతున్నది. ‘సర్' ముగిసిన తర్వాత జరుగబోయే తొలి ఎన్నికలుగా ఖైరతాబాద్ బైపోల్ ప్రాధాన్యం సంతరించుకున్నది.
Khairatabad By Elections | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ తొలి పరీక్షకు సిద్ధమవుతున్నది. ‘సర్’ ముగిసిన తర్వాత జరుగబోయే తొలి ఎన్నికలుగా ఖైరతాబాద్ బైపోల్ ప్రాధాన్యం సంతరించుకున్నది. దానం నాగేందర్ అనర్హతకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. నిబంధనల ప్రకారం ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి ఆరు నెలల్లోగా ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈలోగా ‘సర్’ ప్రక్రియ కూడా పూర్తికానున్నది. అయితే, ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియలో ఓటర్ల జాబితాలో భారీగా మార్పులు చోటుచేసుకోవడం ఉపఎన్నికపై ఆసక్తిని మరింత పెంచుతున్నది.
‘సర్’ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఖైరతాబాద్ నియోజకవర్గంలో 2,93,667 మంది ఓటర్లు ఉన్నారు. అయితే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలయ్యే సమయానికి ఈ సంఖ్య 1,70, 195కు తగ్గింది. ‘సర్’లో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్‌లు సమర్పించినవారిని మాత్రమే డ్రాఫ్ట్ జాబితాలో చేర్చారు. 1,23,472 మంది పేర్లు తొలగించారు. వీరిని ప్రధానంగా ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఓటు (ఏఎస్‌డీడీ) క్యాటగిరీల కింద గుర్తించారు. తొలగించిన ఓటర్లలో అత్యధికంగా 95,082 మంది ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్టు ఎన్నికల అధికారులు గుర్తించారు. మరణించినవారు, డూప్లికేట్ ఓట్లు, ఇతర కారణాలతో గైర్హాజరైనవారిని కూడా ఏఎస్‌డీడీ క్యాటగిరీలో చేర్చారు.
ఈ భారీ తొలగింపుతో ఖైరతాబాద్ నియోజకవర్గ ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది. అయితే డ్రాఫ్ట్ జాబితా ఆధారంగా తుది ఓటర్ల కూర్పుపై ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రావడం సాధ్యం కాదు. ‘సర్’ ప్రక్రియలో మరో కీలక పరిణామంగా 81,404 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. 2002 నాటి జాబితాతో లింక్ కాకపోవడం, ఎన్యుమరేషన్ ఫామ్ వివరాల్లో వ్యత్యాసాలు ఉండటం వంటి కారణాలతో ఈ నోటీసులు ఇచ్చారు. నోటీసులకు సంబంధించి ఓటర్లు సమర్పించే వివరణలు, పత్రాలను పరిశీలించిన అనంతరం ఎంతమంది పేర్లు తుదిజాబితాలో తిరిగి చేరుతాయన్నది కీలకంగా మారింది. నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల దృష్టి ఇప్పుడు ఈ ప్రక్రియపైనే ఉన్నది.
2023లో 52.34 శాతం పోలింగ్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో 2,96,036 మంది ఓటర్లు ఉండగా, 1,53,730 ఓట్లు పోలయ్యాయి. అంటే 52.34 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు 67,368 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పీ విజయారెడ్డికి 45,358 ఓట్లు లభించాయి. గతంలో ఖైరతాబాద్‌లో 85 వేలకుపైగా బీసీ ఓటర్లు, 75 వేలకుపైగా ముస్లిం ఓటర్లు, 65 వేలకుపైగా ఎస్సీ ఓటర్లు ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ వర్గాలు నియోజకవర్గంలోని ప్రధాన ఓటరు సమూహాలుగా ఉన్నా యి. అయితే ‘సర్’లో భారీసంఖ్యలో పేర్లు తొలగించడం, వేలాది మందికి నోటీసులు జారీ చేయడం వల్ల తుది ఓటర్ల జాబితాలో ఈ సామాజికవర్గాల సంఖ్య ఎంతమేరకు మారుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తుదిజాబితా వెలువడిన తర్వాతే కొత్త ఓటర్ల కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
మారిన రాజకీయ సమీకరణాలు
ఖైరతాబాద్ ఉపఎన్నిక కేవలం ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసే ఎన్నికగా కాకుండా, ‘సర్’ అనంతరం మారిన ఓటర్ల జాబితాతో జరిగే తొలి రాజకీయ పరీక్షగా మారనున్నది. డ్రాఫ్ట్ జాబితా, తుది జాబితా మధ్య ఎంతమేరకు మార్పులు ఉంటాయి? నోటీసులు అందుకున్నవారిలో ఎంతమంది తిరిగి ఓటర్లుగా నమోదవుతారు? నియోజకవర్గంలోని వివిధ సామాజికవర్గాల ఓటర్ల సంఖ్య ఎలా మారుతుంది? వంటి అంశాలు ఉపఎన్నికలో రాజకీయ పార్టీల వ్యూహాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. నవంబర్ 9న వెలువడే తుదిజాబితా ఎన్నికల సమీకరణాలకు కీలక ఆధారంగా మారనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

