ముంబై, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఇరాన్-అమెరికా యుద్ధం పరిధి రోజురోజుకూ పెరుగుతున్నది. గత ఏడెనిమిది రోజులుగా ఇరాన్ సమీపంలోని హొర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లో 3,200 కార్గో నౌకలు చికుకుపోయాయి. పుణె, నాసిక్ సహా మహారాష్ట్ర నుంచి ద్రాక్ష, అరటి పండ్లు, ఉల్లిపాయలు, బియ్యం, కూరగాయలను తీసుకెళ్లే దాదాపు 70 నుంచి 80 కార్గో షిప్‌లు ఉన్నాయి.
ఈ నౌకల్లోని వివిధ వ్యవసాయ ఉత్పత్తుల విలువ దాదాపు రూ.3,500 కోట్లు. యుద్ధం కారణంగా రైతుల ఆదాయానికి ముప్పు ఏర్పడింది. నష్టాలను నివారించడానికి, రెండు రోజుల్లో ఉరణ్, జేఎన్పీటి ఓడరేవుల నుంచి సుమారు 450 కంటైనర్లు నాసిక్‌కు తిరిగి వచ్చాయి. ఎగుమతిదారులు మలేషియా, ఇండోనేషియాకు కొన్ని వస్తువులను పంపడానికి ప్రయత్నించడం ప్రారంభించారు.