కారేపల్లి, ఆగస్టు 10 : కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక రైతు విధానాలపై నిరసిస్తూ సోమవారం దేశ వ్యాప్తంగానిర్వహించిన జైలు భరో కార్యక్రమం కారేపల్లిలో విజయవంతమైంది. సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు కారేపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ లో రాస్తారోకో, మానహారం చేపట్టారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. కారేపల్లి ఎస్ఐ బైరు గోపీ ఆధ్వర్యంలో పోలీసులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తుండగా కార్మికులు వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వ్యవసాయ కార్మిక సంఘం నేతను స్టేషన్ కు తరలించిన అనంతర మిగితా నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా వ్య.కా.స. నేత కొండబోయిన నాగేశ్వరరావు, సీఐటీయు మండల కన్వీనర్ కే.నరేంద్ర మాట్లాడతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, కార్మికులు, రైతులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కేశగాని ఉపేందర్, యనమనగండ్ల రవి, పాసిని నాగేశ్వరరావు, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు సురభాక ధనమ్మ, కొండబోయిన ఉమావతి, సీఐటీయూ ముక్క సీతారాములు, అజ్మీర శోభన్, సోమందుల నాగమణి, ఎల్లబోయిన రాధ, గుర్రం వెంకటేశ్వర్లు, కేలోత్ రవి, శనగ రాంబాబు, ఆదెర్ల వినయ్, రేగళ్ల మంగయ్య, కరపటి సీతారాములు, కొండల్రావు, ఇస్మాయిల్, కళ్యాణి, యాదగిరి పాల్గొన్నారు.