మాస్కో, సెప్టెంబర్ 21 : రష్యా పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించారు. 450 సీట్లున్న పార్లమెంట్ దిగువ సభ డుమాలో ఆయనకు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ 355 సీట్లను కైవసం చేసుకుంది. ఎన్నికల చీఫ్ ఎల్లా పామ్ఫిలోవా సోమవారం ఎన్నికల ఫలితాలను విడుదల చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఎన్నికల్లో పుతిన్ను విమర్శించే ఏ పార్టీలు పోటీలో లేవు.
దీంతో ఆయన పార్టీ 2016లో సాధించిన దానికన్నా ఘన విజయం సాధించింది. పార్లమెంట్లో ప్రవేశించడానికి అవసరమైన కనిష్ఠ స్థాయిని కేవలం నాలుగు పార్టీలు మాత్రమే దక్కించుకున్నాయి. ఇందులో కమ్యూనిస్ట్ పార్టీ 40 సీట్లు, ద నేషనలిస్ట్ లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్డీపీఆర్) 25, న్యూ పీపుల్ 20, ఎ జస్ట్ రష్యా పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించాయి.