న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో కాస్త ఊరట దక్కింది. ఆమె పార్టీ పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరు, ఎన్నికల గుర్తు పూలు-గడ్డిని ఫ్రీజ్ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ వారంలోనే విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు.
ఎన్నికల సంఘం టీఎంసీలోని రెండు వర్గాలకు చెరోపేరు, చెరో గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.