న్యూయార్క్ : ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధం అయిందని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ సారి ఫిట్నెస్ ప్లస్ ఆడియో విభాగంపై ప్రభావం పడనుంది. టైమ్ టు వాక్, టైమ్ టు రన్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం.
ఫిట్నెస్ ప్లస్ అనేది యాపిల్ తన యూజర్లకు అందిస్తున్న సబ్స్క్రిప్షన్ ఆధారిత వ్యాయామ సేవ. కోత కారణంగా కొత్త ఆడియో కంటెంట్ రిలీజ్ లేట్ కావచ్చు. ఫిట్నెస్ ప్లస్ విభాగాన్ని పూర్తిగా తొలగించేఉద్దేశం తమ కు లేదని యాపిల్ వెల్లడించింది.