Fake IAS officer | అజిత్ దోవల్ రహస్య ఏజెంట్నని చెప్పుకున్న నకిలీ ఐఏఎస్ అధికారి.. అరెస్ట్
Fake IAS officer | జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రహస్య ఏజెంట్గా చెప్పుకున్న నకిలీ ఐఏఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న టెస్లా కారుతో సహా విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
పాట్నా: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రహస్య ఏజెంట్గా చెప్పుకున్న నకిలీ ఐఏఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న టెస్లా కారుతో సహా విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. (Fake IAS officer) బీహార్లోని ఖగారియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోగ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్పూర్లో నివసిస్తున్న మనీష్ గుప్తా, ఐఏఎస్ అధికారిగా చెలామణి అవుతున్నాడు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రహస్య ఏజెంట్గా చెప్పుకున్నాడు. ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న, పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ ఉన్న ఖరీదైన టెస్లా కారులో బీహార్ అంతటా అతడు తిరుగుతున్నాడు.
కాగా, మనీష్ గుప్తాపై అనుమానించిన పోలీసులు విలాసవంతమైన అతడి ఇంట్లో సోదాలు చేశారు. అతడు చూపించిన ఐఏఎస్ అధికారి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కార్డులు నకిలీ అని గుర్తించారు. సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ ఉన్న టెస్లా కారు, టాటా సఫారీ వాహనం, విదేశీ మద్యం బాటిల్స్, ఐదు ఆపిల్ ఐఫోన్లు, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్లు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బారాసింఘా లేదా చిత్తడి జింకకు చెందినవిగా భావిస్తున్న రెండు కొమ్ములు కూడా ఆ ఇంట్లో లభించాయి.
మరోవైపు బీహార్లోని వివిధ ప్రాంతాల్లో మోసాలు, అక్రమాలకు పాల్పడేందుకు ఐఏఎస్ అధికారిగా నకిలీ గుర్తింపు కార్డును మనీష్ గుప్తా వినియోగించినట్లు ఖగారియా ఎస్పీ భాను ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ మోసాల ద్వారా గణనీయంగా ఆస్తులు కూడబెట్టినట్లుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. అతడి ఆస్తులు, ఇతర సంపదల మూలాన్ని నిర్ధారించడానికి ఆర్థిక నేరాల విభాగం సహాయాన్ని కూడా కోరినట్లు వివరించారు. మనీష్ గుప్తా ఎంత కాలంగా నకిలీ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు, ఎవరెవరిని మోసం చేశాడు, మోసాల ద్వారా ఎంత సంపాదించాడు అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.
खगड़िया में एक फर्जी IAS पकड़ा गया है। खुद को NSA अजीत डोभाल का अंडरकवर एजेंट बताकर लोगों को बेवकूफ बनाता था।
उस फर्जी IAS साहब के पास ड्राइवरलेस Tesla कार है। उसके घर और घर के आसपास करीब 100 से अधिक CCTV कैमरे लगे हुए हैं। जितनी भी गाड़ियां हैं, सब पर “Government of India” लिखा… pic.twitter.com/ms9qUnBupX
— Mukesh singh (@Mukesh_Journo) August 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

