MYTA Bonalu | మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
MYTA Bonalu | మలేషియా తెలంగాణ సంఘం (MYTA) ఆధ్వర్యంలో నిర్వహించిన “బోనాలు 2026” వేడుకల్లో మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను సమర్పిస్తూ, మంగళహారతులు, భక్తి కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ మహాంకాళి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
MYTA Bonalu | కౌలాలంపూర్, ఆగస్టు 10 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని మలేషియాలో చాటిచెప్పే లక్ష్యంతో మలేషియా తెలంగాణ సంఘం (MYTA) ఆధ్వర్యంలో నిర్వహించిన “బోనాలు 2026” వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఘన విజయాన్ని సాధించాయి. మలేషియాలోని నెగెరి సెంబిలాన్, పోర్ట్ డిక్సన్ సమీపంలోని శ్రీ మహా కరుమారియమ్మన్ ఆలయంలో ఆదివారం, ఆగస్టు 9న నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణకు చెందిన కుటుంబాలు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను సమర్పిస్తూ, మంగళహారతులు, భక్తి కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ మహాంకాళి అమ్మవారి ఆశీస్సులు పొందారు. తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతున్న బోనాల పండుగను మలేషియాలోనూ అదే భక్తి, సంప్రదాయబద్ధతతో నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకల్లో భాగంగా భక్తులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మినరల్ వాటర్తో పాటు బస్సు రవాణా సౌకర్యం కల్పించడంతో కార్యక్రమానికి హాజరైన కుటుంబాలకు MYTA ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోని భావితరాలకు పరిచయం చేయడంతోపాటు, మలేషియాలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ బోనాల వేడుకలు విజయవంతమయ్యాయని MYTA ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు , మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రేజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రేజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్ మార్త, మధు , జీవన్ రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జ్యోతి నాంపల్లి, సుప్రియ కంటే, దీపిక, మోనా, పూర్ణ, అనిల్ రావు, హరీష్, శశి, అడ్వైసరీ మెంబర్స్ గురిజాల సుధీర్, మన్సూర్ అహ్మద్, వేణుగోపాల్ రెడ్డి , ఇతరులు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, ఆలయ నిర్వాహకులు,వాలంటీర్లు, స్పాన్సర్లు, కళాకారులు, మహిళలు, యువత, చిన్నారులు మరియు మలేషియాలోని తెలంగాణ కుటుంబాలందరికీ MYTA హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ‘తెలంగాణ సంస్కృతి – మన గర్వం, మన సంప్రదాయం – మన బాధ్యత’ అనే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరిన్ని సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని MYTA పేర్కొంది.



Read Also :
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

