Bangladesh Man | కీలక నేవీ అకాడమీలో పనిచేస్తున్న బంగ్లాదేశ్ వ్యక్తి.. అరెస్ట్
Bangladesh Man | దేశ రక్షణలో కీలకమైన నేవీ అకాడమీలో బంగ్లాదేశీయుడైన వ్యక్తి పని చేస్తున్నాడు. నకిలీ భారతీయ గుర్తింపు కార్డు, ఇతర నకిలీ ధృవీకరణ పత్రాలతో అతడు కాంట్రాక్ట్ ఉద్యోగం పొందినట్లు నేవీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించగా అరెస్ట్ చేశారు.
తిరువనంతపురం: దేశ రక్షణలో కీలకమైన నేవీ అకాడమీలో బంగ్లాదేశీయుడైన వ్యక్తి పని చేస్తున్నాడు. నకిలీ భారతీయ గుర్తింపు కార్డు, ఇతర నకిలీ ధృవీకరణ పత్రాలతో అతడు కాంట్రాక్ట్ ఉద్యోగం పొందినట్లు నేవీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించగా అరెస్ట్ చేశారు. (Bangladesh Man) కేరళలోని అత్యంత సున్నితమైన ఎజిమల నావల్ అకాడమీలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల బిప్లోబ్ సోరెన్ గత ఏడాదిగా ఆ నేవీ అకాడమీలోని లాండ్రీ విభాగంలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.
కాగా, ఇటీవల ఆ వ్యక్తి ప్రవర్తనపై నేవీ అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతడిపై నిఘా ఉంచారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకుని విచారించారు. బిప్లోబ్ సోరెన్ బంగ్లాదేశ్ పౌరుడని సూచించే పత్రాలు, ఇతర సమాచారాన్ని అతడి మొబైల్ ఫోన్లో అధికారులు గుర్తించారు. నకిలీ భారతీయ గుర్తింపు కార్డు, ఇతర నకిలీ ధృవీకరణ పత్రాలతో అతడు కాంట్రాక్ట్ ఉద్యోగం పొందినట్లు గ్రహించారు. సరైన పత్రాలు లేకుండా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులకు అప్పగించగా అతడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన రక్షణ సంస్థలో ఒక విదేశీ వ్యక్తి దాదాపు ఏడాది పాటు కాంట్రాక్ట్ కార్మికుడిగా ఎలా పనిచేయగలిగాడు? అన్న దానిపై పలు ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. బంగ్లాదేశీ జాతీయుడు నకిలీ పత్రాలు ఎలా సంపాదించాడు? కీలకమైన రక్షణ సంస్థలోకి ఎలా ప్రవేశం పొందాడు? అతడి ఉద్యోగానికి ఎవరు సహకరించారు? ఇతర భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా? అన్నది పోలీసులు, నేవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- Bangladesh Man
- caught
- fake
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

