ఎనిమిదేండ్లు వెనక్కి వెళ్లారు
“ఈ నగరానికి ఏమైంది’ సినిమా తీసినప్పుడు ఎలాంటి లెక్కలు వేసుకోలేదు. నా మనసుకి అనిపించింది నేను చేశాను. ఆ సినిమా రీరిలీజ్ సందర్భంగా ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్‌తో ఒళ్లు దగ్గర పెట్టుకొని ‘ఈఎన్ఈ’ రిపీట్ తీశాను’ అన్నారు తరుణ్‌భాస్కర్.
“ఈ నగరానికి ఏమైంది’ సినిమా తీసినప్పుడు ఎలాంటి లెక్కలు వేసుకోలేదు. నా మనసుకి అనిపించింది నేను చేశాను. ఆ సినిమా రీరిలీజ్ సందర్భంగా ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్‌తో ఒళ్లు దగ్గర పెట్టుకొని ‘ఈఎన్ఈ’ రిపీట్ తీశాను’ అన్నారు తరుణ్‌భాస్కర్. ఆయన దర్శకత్వంలో విశ్వక్సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ఈఎన్ఈ రిపీట్) నేడు విడుదలవుతున్నది.
మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. “ఈ నగరానికి ఏమైంది’ వచ్చి ఎనిమిదేళ్లవుతుంది. ఈ సమయంలో విశ్వక్సేన్, అభినవ్ ఎంతో ఎదిగారు. కానీ ఈ సినిమా కోసం మళ్లీ ఎనిమిదేండ్లు వెనక్కి వెళ్లారు. ఒక్క శుక్రవారం కోసం ఈ సినిమా చేయలేదు. భవిష్యత్తు తరాలు కూడా చూసి ఎంజాయ్ చేసేలా తెరకెక్కించాను’ అని తరుణ్‌భాస్కర్ తెలిపారు. తన కెరీర్లోనే మైలురాయిలా నిలిచే చిత్రమిదని విశ్వక్సేన్ చెప్పారు. యువతతో పాటు ఫ్యామిలీస్ అందరూ సెలబ్రేట్ చేసుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

