కొత్త ఇన్చార్జి.. పాత వివాదం!
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్చార్జి బీఎం సందీప్‌కు సంబంధించిన 2022 నాటి గుజరాత్ నగదు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సూరత్‌లో అంగడియా సంస్థ వద్ద రూ.75 లక్షల నగదు పట్టుబడిన ఘటనలో సందీప్ పేరును ప్రస్తావిస్తూ అప్పట్లో బీజేపీ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో చకర్లు కొడుతున్నాయి.
- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సందీప్ ఉదంతంపై విస్తృత ప్రచారం
- అంగడియా సంస్థ వద్ద 75 లక్షల నగదు పట్టివేతలో ఆయన పేరు
- తాజాగా చర్చకు దారితీసిన 2022 గుజరాత్ ఎన్నికల నాటి ఆరోపణలు
హైదరాబాద్ , నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్చార్జి బీఎం సందీప్‌కు సంబంధించిన 2022 నాటి గుజరాత్ నగదు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సూరత్‌లో అంగడియా సంస్థ వద్ద రూ.75 లక్షల నగదు పట్టుబడిన ఘటనలో సందీప్ పేరును ప్రస్తావిస్తూ అప్పట్లో బీజేపీ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో చకర్లు కొడుతున్నాయి. నగదు తీసుకొనేందుకు సందీప్ అకడికి వచ్చి, పోలీసులను గమనించి వెనుదిరిగి వెళ్లారంటూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ చేసిన వ్యాఖ్యలను పలువురు మళ్లీ ప్రచారంలోకి తెస్తున్నారు. కర్ణాటకలోని చిక్ మంగళూరుకు చెందిన బీఎం సందీప్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
గతంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల పార్టీ వ్యవహారాలనూ పర్యవేక్షించారు. ఈ క్రమంలో 2022 నవంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు సూరత్‌లో చోటుచేసుకొన్న నగదు పట్టివేత ఘటన అప్పట్లో రాజకీయ దుమారం రేపింది. మహీధర్ పురా ప్రాంతంలో ఎన్నికల నిఘా బృందం ఓ కారును తనిఖీ చేయగా రూ.75 లక్షల నగదు లభించింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఉదయ్ గుర్జర్, మహ్మద్ ఫయాజ్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మూడో వ్యక్తి అకడి నుంచి వెళ్లిపోయినట్టు అప్పటి వార్తా కథనాలు పేరొన్నాయి. ఆ నగదు అంగాడియా సంస్థ నుంచి తీసుకొస్తున్నట్టు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి.
పట్టుబడిన కారులో సందీప్ పేరిట పాస్‌లు
నగదు పట్టుబడిన అదే కారులో బీఎం సందీప్ పేరుతో ఉన్న వీఐపీ పాస్ లభించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. సీసీటీవీ దృశ్యాల్లో సందీప్ కనిపించారంటూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపణలు చేశారు. అది కాంగ్రెస్ పార్టీకి చెందిన నగదు అని, దాన్ని తీసుకెళ్లేందుకు సందీప్ అకడికి వచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆ నగదు కాంగ్రెస్‌కు చెందినదని నిరూపించే ఆధారాలు లేవని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఆ ఆరోపణలను ఖండించారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి సందీప్ కాదని కూడా కాంగ్రెస్ వర్గాలు పేరొన్నాయి. తాజాగా సందీప్‌కు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడంతో అప్పటి ఘటనకు సంబంధించిన వార్తలు, వీడియోలు మళ్లీ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా దిశానిర్దేశం చేయాల్సిన కీలక బాధ్యతలు చేపట్టనున్న నేత.. గతంలో ఎదురొన్న ఈ ఆరోపణలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీయడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

