డౌన్ ట్రెండ్‌లో గోల్డ్ మార్కెట్
అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూలతల ప్రభావంతో దేశీయ మార్కెట్లో వరుసగా ఏడోరోజూ బంగారం ధరలు క్షీణించాయి.
- వరుసగా ఏడోరోజూ క్షీణించిన బంగారం ధరలు
- దాదాపు ఏడాది కనిష్ఠానికి చేరిక
- ఒక్కరోజే తులం రూ.2,800 పతనం
- రూ.5,000 పడిపోయిన కిలో వెండి
న్యూఢిల్లీ, నవంబర్ 18: అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూలతల ప్రభావంతో దేశీయ మార్కెట్లో వరుసగా ఏడోరోజూ బంగారం ధరలు క్షీణించాయి. ఢిల్లీలో బుధవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు మరో రూ.2,800 పడిపోయి రూ.1,35,800 వద్ద నిలిచింది. అలాగే 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పసిడి విలువ తులం హైదరాబాద్‌లో రూ.2,550 దిగి రూ.1,22,150గా నమోదైంది.
వెండి ధరలూ పతనం
వెండి ధరలపైనా ఒత్తిడి కొనసాగింది. మంగళవారం ముగింపు ధర కిలోకు రూ.1,69,500తో పోలిస్తే రూ.5,000 తగ్గి రూ.1,64,500కు చేరింది. ‘అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇది భారతీయ మార్కెట్లోనూ కనిపించింది. మొత్తానికి ఈ డౌన్ ట్రెండ్‌తో గత ఏడాది డిసెంబర్ తర్వాత కనిష్ఠ స్థాయికి ధరలు చేరాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా ఈక్విటీ మార్కెట్ల బలహీనత కూడా అమ్మకాలను మరింత పెంచిందని, మార్జిన్ చెల్లింపుల కోసం విలువైన లోహాల్లో పెట్టుబడులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.
గ్లోబల్ మార్కెట్లో..
విదేశీ మార్కెట్లలో స్పాట్ బంగారం రేటు ఔన్స్‌కు 78.71 డాలర్లు లేదా 2.04 శాతం తగ్గి 3,770.54 డాలర్లకు చేరగా, వెండి 3 శాతానికిపైగా పడిపోయి ఔన్స్ 45.86 డాలర్లు పలికింది. గ్లోబల్ మార్కెట్ల తీరుతెన్నులను చూస్తుంటే ఇప్పట్లో ఈ పతనం ఆగేలా కనిపించడం లేదని మార్కెట్ నిపుణులు ప్రస్తుత ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది జనవరి ఆఖర్లో 24 క్యారెట్ తులం బంగారం ధర దేశీయ మార్కెట్లో మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,83,000గా నమోదైంది. కిలో వెండి రేటూ ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని సూచిస్తూ రూ.4,04,500ను తాకింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

