IED blast | కొత్తగూడెం ప్రగతి మైదాన్ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు (IED blast). ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాశ్ రావు ప్రాణాలు కోల్పోగా.. పలువురు పోలీసు అధికారులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన సుక్మా (Sukma) జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా భద్రతా దళాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా దళాల చర్యతో ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న మావోయిస్టులు.. అదును చూసి దెబ్బతీశారు. భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ.. సూక్మా జిల్లాలోని కొంటా – ఎర్రబోర్ మార్గంలో మందుపాతరను అమర్చారు.
అదే సమయంలో అదనపు ఎస్పీ ఆకాశరావు తన బృందంతో కలిసి గస్తీ కోసం బయల్దేరారు. ఈ క్రమంలో నక్సలైట్లు అమర్చిన మందు పాతర పేలి అదనపు ఎస్పీ ఆకాశరావు ప్రాణాలు కోల్పోగా.. పలువురు పోలీసులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Also Read..
Los Angeles | లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న ఆందోళనలు.. కార్లకు నిప్పు.. VIDEOS
Overcrowded Local Train | రైల్లో నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి
Honeymoon Couple | వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ.. భర్తను భార్యే హత్య చేయించింది