మోర్బీ (గుజరాత్ : అమెరికా-ఇరాన్ యుద్ధ దుష్ప్రభావం భారత్‌పై పడింది. యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో ఏర్పడిన ఆటంకాలతో గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో 100 సిరామిక్ తయారీ యూనిట్లు మూతపడ్డాయి. ఇంధన సరఫరా సాధారణ స్థితికి రాకపోతే మరో 400 యూనిట్లు మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయని మోర్బి సిరామిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోజ్ అర్వాదియా హెచ్చరించారు.
పరిశ్రమకు అవసరమైన ప్రొపేన్ గ్యాస్ గత రెండు రోజులుగా సరఫరా కాకపోవడంతో దానిపై ఆధారపడ్డ 100 యూనిట్లు మూతపడ్డాయన్నారు. పరిస్థితి మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే మరో 400 యూనిట్లదీ అదే దారి అవుతుందన్నారు.