Independence Day Treat | ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు టాలీవుడ్లో ఎన్నడూ లేని విధంగా భారీ పోటీ నెలకొంది. బాక్సాఫీస్ రేసులో నిలిచేందుకు పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు ఏకంగా 7 సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకే తేదీని టార్గెట్ చేస్తూ ఇన్ని సినిమాలు బరిలోకి దిగుతుండటంతో థియేటర్ల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్స్ మరియు కలెక్షన్ల పరంగా తీవ్రమైన పోటీ తలెత్తింది. ఇక ఇందులో తెలుగులోనే 5 సినిమాలు రాబోతుండగా హిందీ నుంచి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఆ 7 సినిమాలు ఏంటి అనేది చూసుకుంటే.!
విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons)
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో మమిత బైజు కథనాయికగా నటిస్తుండగా రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రంపై అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే కరుప్పు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూర్య ఈ సినిమాతో మరో హిట్టు కొడతాడని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.
అగధ (Agadha)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఇది. మిస్టిక్ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ రాబోతున్న ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాపై కూడా టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మకుటం (Makutam)
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘మకుటం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 99వ ప్రాజెక్ట్‌గా ఇది వస్తోంది. ఇందులో విశాల్ భిన్నమైన మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించనున్నారు. విశాల్, అంజలి కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ ఈ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
పల్లాబురుసు (Pallaburusu)
గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో సాగే ఒక సరికొత్త ఫ్యామిలీ కామెడీ-డ్రామా చిత్రం ఇది. సాధారణమైన ఒక వృద్ధ తండ్రి తన కొడుకుపై పోలీస్ స్టేషన్లో చిన్న కారణం (టూత్‌బ్రష్ కొనివ్వలేదని) నిమిత్తం కంప్లైంట్ ఇవ్వడం వంటి విభిన్నమైన పాయింట్‌తో ఈ కథ నడుస్తుంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలు, అహం, మారుతున్న సామాజిక విలువలను కళ్లకు కట్టేలా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో తెరకెక్కించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ & ఎపిక్ స్టూడియోస్ నిర్మించాయి.
హుషార్ పిట్టలు (Hushar Pittalu)
వాసవి గణేషన్, అన్ష్, సునితా మనోహర్, అంజి వల్గుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు భిక్షు దర్శకత్వం వహించాడు. పూర్తిగా యూత్‌ఫుల్, లవ్ మరియు ఫ్రెండ్షిప్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందిన చిత్రం ఇది. నేటి యువత ఆలోచనలు, వారి జీవితంలోని సరదా క్షణాలు, ప్రేమ మరియు అనుబంధాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బాక్సాఫీస్ వద్ద కాలేజ్ గోయర్స్ మరియు యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా రూపొందింది.
ఆవారాపన్ 2 (Awarapan 2)
ఇమ్రాన్ హష్మీ, దిశా పటాని, షబానా ఆజ్మీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంచలన విజయం సాధించిన ‘ఆవారాపన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న క్రేజీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఇది. ‘శివమ్’ పాత్ర మరోసారి క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, ప్రేమ, ప్రతీకారం, త్యాగం మరియు విముక్తి కోసం సాగించే అన్ವೇషణ దీని ప్రధాన కథాంశం. ఇమ్రాన్ హష్మీ ఇంటెన్స్ యాక్షన్ లుక్స్, మేకింగ్ పరంగా ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంది.
బట్వారా 1947 (Batwaran 1947)
సన్నీ డియోల్, ప్రీతి జింటా, షబానా ఆజ్మీ, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించగా అమీర్ ఖాన్ నిర్మించాడు. చారిత్రక నేపథ్యంలో దేశ విభజన నాటి (1947) కఠిన పరిస్థితులు, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన మానవ వలసలు, ఆ సమయంలో ఎదురైన హింస, హృదయ విదారక పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన శక్తివంతమైన పీరియాడికల్ డ్రామా చిత్రం ఇది. అస్గర్ వజాహత్ రాసిన ప్రసిద్ధ నాటకం ‘జి లాహోర్ నై వెఖ్యా, ఓ జమ్యా ఇ నై’ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం మరియు భారీ తారాగణంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.