నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 2011లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సకల జనుల సమ్మెలో పాల్గొన్నందుకు కేసీఆర్, కేటీఆర్, పద్మారావు, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ కుమార్, కోదండరామ్ సహా 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులన్నింటినీ తొలగించాలని స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినప్పటికీ ఈ కేసును తొలగించలేదు. దీంతో జీవో 167 ప్రకారం ఈ కేసును కూడా తొలగించాలని కోరడంతో అందుకు కోర్టు అంగీకరించిందని, కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించిందని న్యాయవాది జక్కుల లక్ష్మణ్ తెలిపారు.