అహ్మదాబాద్ : రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో గుండెను తరలించారు. సూరత్ రైల్వే స్టేషన్ నుంచి శుక్రవారం ఉదయం 9.05 గంటలకు ముంబై-గాంధీనగర్ క్యాపిటల్ వందేభారత్ రైలులో డోనర్ గుండెతో వైద్యబృందం బయలు దేరింది. రెండున్నర గంటల ప్రయాణం తర్వాత అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి దవాఖానకు తరలించారు.