Kodangal Demolitions | సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు పట్టణంలో అధికారులు పోలీసుల పహారాలో బుల్డోజర్లతో తీసుకెళ్లి ఇండ్లను కూల్చేసిన విషయం తెలిసిందే. బుల్డోజర్ల ధాటికి 80 కుటుంబాలు ఇండ్లు కోల్పోగా.. 20 షాపులను సైతం అధికారులు కూల్చివేశారు. తమకు ఒక్క నోటీసు ఇవ్వకుండా ఇల్లు కూల్చేశారని, కనీసం పరిహారం కూడా ఇస్తామని అనలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాకు ముగ్గురు కొడుకులు సార్.. ఇల్లు కూల్చివేశారు.. ఏం చేయాలి..కాళ్లు మొక్కాలా అంటూ ఓ బాధితురాలు కన్నీరుమున్నీరయింది. కలెక్టర్‌తో మాట్లాడా.. రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడుతా.. న్యాయం జరిగేదాకా పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వారికి భరోసానిచ్చారు.
ఈ నేపథ్యంలో మద్దూరులో ఇండ్లు కోల్పోయిన బాధితులకు నరేందర్ రెడ్డి అండగా నిలిచారు. నోటీసులు లేకుండా ఇండ్లు కూల్చివేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇండ్లు కోల్పోయిన వారికి 200 గజాల ఇంటి స్థలం కల్పించాలని ఆయన రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.
కొడంగల్ నియోజకవర్గం మద్దూరులో ఇండ్లు కోల్పోయిన బాధితులకు పట్నం నరేందర్ రెడ్డి అండ
నోటీసులు లేకుండా ఇండ్లు కూల్చివేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన పట్నం నరేందర్ రెడ్డి
వెంటనే ఇండ్లు కోల్పోయిన వారికి 200 గజాల ఇంటి స్థలం కల్పించాలని పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ pic.twitter.com/8kDn03ZBCs
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2026
Allu Arjun | భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ మూమెంట్.. స్నేహారెడ్డికి బన్నీ స్పెషల్ విషెస్ వైరల్!
Srinivas Reddy | ప్రజలవిశ్వాసమే.. జర్నలిస్టులకు రక్షణ.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
కడు పేదరికం నుండి యువ ద్రోణాచార్యుడిగా పొన్నాల పృథ్వీరాజ్