Pakistan : పాకిస్తాన్ అంటేనే నేరాలు, ఘోరాలు, దారుణాలు అన్నట్లు ఉంటుంది పరిస్థితి. దీనికి తాజా ఘటన మర నిదర్శనం. కొందరు సాయుధులు ఏకంగా క్రీడాకారులు ప్రయాణిస్తున్న బస్సునే దోపిడీచేశారు. ఈ ఘటన అక్కడ ఉన్న శాంతి భద్రతల స్థాయిని తెలియజేస్తుంది. బలూచిస్తాన్ పరిధిలో ఫుట్బాల్ క్రీడాకారుల బస్సును దుండగులు దోపిడీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి.
కరాచీ ఫుట్బాల్ టీం అయిన కరాచీ డిస్ట్రిక్ట్ వెస్ట్ స్క్వాడ్ జట్టుకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు క్వెట్టాలో జరుగుతున్న సీఎం గోల్డ్ కప్ కోసం బస్సులో బయల్దేరారు. మస్తుంగ్-సరియాబ్ మార్గంలో వెళ్తుండగా సోమవారం ఉదయం ఆయుధాలు కలిగిన 12 మంది బస్సును అడ్డగించారు. తుపాకులతో బెదిరించి క్రీడాకారుల దగ్గరున్న డబ్బు, మొబైల్స్, ఇతర విలువైన వస్తువుల్ని దోచుకెళ్లారు. క్రీడాకారుల దుస్తులు విప్పించి, కొంతమందిపై దాడిచేశారు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
A #football team travelling from #Karachi to #Quetta was reportedly robbed near #Mastung By #BLA. The players lost phones and cash. They came as guests and deserve to feel safe.@mirsarfraz77 Sarfraz Bugti, please ensure their safety and help recover or compensate their losses.… pic.twitter.com/iYAfITK77y
— Baloch Nojawan (@Baloch_Nojawan) September 28, 2026
క్రీడాకారులు క్వెట్టా చేరుకునేందుకు సహాయం అందించారు. క్రీడల్లో పాల్గొనేందుకు క్రీడాకారుల దగ్గర ఎలాంటి నగదు లేదు. ఈ ఘటన గురించి బలూచిస్తాన్ క్రీడాశాఖ మంత్రి స్పందించారు. క్రీడాకారులకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో దోపిడీలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.