Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు రంగం సిద్ధం.. రేపు స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఐఎస్ఎస్కు
Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు (ISS) రంగం సిద్ధమైంది.
Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు (ISS) రంగం సిద్ధమైంది. అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్‌లో భాగంగా రేపు (మంగళవారం) ఆయన నింగిలోకి దూసుకెళ్లనున్నారు. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. తద్వారా రోదసి యాత్ర చేపట్టిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, రష్యా సహకారంతో అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే.
ఈ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష యాత్ర భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:52 గంటలకు ప్రారంభం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) పంపుతున్నారు. ఈ మిషన్‌కు శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పైలట్‌గా వ్యవహరించబోతున్నారు.
భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. ‘స్పేస్ఎక్స్’ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ వ్యోమనౌక ద్వారా శుభాంశు శుక్లా ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రకెక్కనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ ప్రయోగం రేపటికి వాయిదా పడింది. ప్రయోగానికి ముందు సన్నాహాల్లో గుర్తించిన చిన్న సాంకేతిక సమస్య కారణం మిషన్‌ను వాయిదా వేసినట్లు అమెరికాకు చెందిన వాణిజ్య మానవ సహిత అంతరిక్షయాన సంస్థ యాక్సియమ్ స్పేస్ (Axiom Space), నాసా (NASA) సంయుక్తంగా ప్రకటించాయి.
Also Read..
Errol Musk | నా కుమారుడు మస్క్‌పై ట్రంపే గెలుస్తారు : ఎర్రోల్ మస్క్
Donald Trump | విమానం ఎక్కుతూ పడిపోబోయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వీడియో వైరల్
Los Angeles | లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న ఆందోళనలు.. కార్లకు నిప్పు.. VIDEOS
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

