Tragedy | బీబీనగర్, ఫిబ్రవరి 3: కుటుంబ కలహాలు మరో ఇంటిని చిదిమేశాయి. ఇద్దరు పిల్లల్ని చంపి, ఓ తల్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్ యాదవ్, ఐశ్వర్య దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. సోమవారం నాడు ఐశ్వర్య కుటుంబసభ్యులు ఆమెను తీసుకొచ్చి అత్తారింట్లో వదిలేసి వెళ్లారు. కానీ అదే రోజు రాత్రి ఇద్దరు చిన్నారులను మెత్తతో ఊపిరాడకుండా చేసి ఐశ్వర్య చంపేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.