Shivaji Raja | టాలీవుడ్లో నేడు విషాద వాతావరణం నెలకొంది. ఒకప్పటి హీరో, ప్రస్తుతం ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న శివాజీ రాజా తండ్రి జి. రామరాజు నేడు కన్నుమూశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, జి. రామరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయోభారం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో నేడు ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని స్వగృహంలో 85 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
జి. రామరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 3 గంటల లోపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు శివాజీ రాజా నివాసానికి చేరుకుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. శివాజీ రాజా కుటుంబానికి ఈ కష్ట సమయంలో ధైర్యం కలగాలని, ఆత్మకు శాంతి చేకూరాలని సినీ వర్గాలు ప్రార్థిస్తున్నాయి.
యాక్టర్ శివాజీ రాజా.. పేరు చెప్పగానే మనందరికి గుర్తొచ్చేది ‘అమృతం’ సీరియల్. ఆ సీరియల్ లో ఆయన క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది మాత్రమే కాదు.. వందల సినిమాల్లో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్లు చేసిన ఆయన అశేష అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాలు, టీవీ సీరియళ్లు, టీవీ షోలు చేసిన ఆయన ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యారు . అయితే, ‘మొగుడ్స్ పెళ్లామ్స్స షో కూడా శివాజీ రాజాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.