తుంగతుర్తి, మార్చి 08 : తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం నుండి గుండెపురి వరకు రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు పంపినా ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేల్ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే నిధులు కేటాయించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆకారపు భాస్కర్, కొల్లూరి మహేందర్, కోతమర్తి సైదులు, కోరుకొప్పుల వెంకన్న, కోరుకొప్పుల ఉప్పలయ్య, భైరోజు సోమనర్స, గడ్డం సూరయ్య, పొదిలి కిష్టయ్య, యమా రవి పాల్గొన్నారు.