థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు అక్రమంగా హైడ్రోపోనిక్ గంజాయి
థాయ్‌లాండ్ నుంచి భారత్‌లోని పలు నగరాలకు అక్రమంగా హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టయింది. ఈ నెట్‌వర్క్‌తో 96 మందికి సంబంధం ఉన్నట్టు తెలంగాణ ఈగల్ ఫోర్స్ గుర్తించింది. వీరిలో మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన 60 మంది రవాణాదారులకు ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద నోటీసులు జారీ చేసినట్టు శనివారం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే..
- అంతర్జాతీయ డ్రగ్ ముఠా గుట్టురట్టు
- 96 మందిని గుర్తించిన ‘ఈగల్’
- మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన60 మందికి నోటీసులు జారీ
- 15 ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): థాయ్‌లాండ్ నుంచి భారత్‌లోని పలు నగరాలకు అక్రమంగా హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టయింది. ఈ నెట్‌వర్క్‌తో 96 మందికి సంబంధం ఉన్నట్టు తెలంగాణ ఈగల్ ఫోర్స్ గుర్తించింది. వీరిలో మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన 60 మంది రవాణాదారులకు ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద నోటీసులు జారీ చేసినట్టు శనివారం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. అంతర్జాతీయ ప్రయాణికుడిగా ఏప్రిల్ 7న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సోదా మొహ్సీన్ బహదూర్ భాయ్ లగేజీలో 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది.
దీనిపై కస్టమ్స్ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ సిబ్బంది.. ఈ నెల 8న హైదరాబాద్‌లోని రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్లో సందీప్ జయప్రకాశ్, హర్షద్ మన్సుఖ్ భాయ్ ప్రజాపతిని అదుపులోకి తీసుకుని 12.739 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కీలక వ్యక్తిగా అనుమానిస్తున్న హేమాంగ్ ప్రమోద్ కులేసర్, మరో 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా థాయ్‌లాండ్ నుంచి హైడ్రోపోనిక్ గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్, ముంబై, గుజరాత్, కోల్‌కతా తదితర నగరాలకు తరలిస్తున్నట్టు ఈగల్ ఫోర్స్ వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్‌లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

