హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగంలో లోటుపాట్లను సరిదిద్దాలని వ్యవసాయ, మారెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు సూచనల నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రసాయన ఎరువుల అతి వినియోగంపై ఆందోళన వ్యక్తంచేస్తూ, యూరియా వాడకం జాతీయ సగటు కంటే ఎకువగా ఉన్నదని, జీవ ఎరువులు, సూక్ష్మ పోషకాల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. యాసంగికి అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.