అటవీ భూముల్లో జోక్యం చేసుకోవద్దు
అటవీ భూముల్లో రెవెన్యూ శాఖ జోక్యం చేసుకోరాదని హైకోర్టు హెచ్చరించింది. అటవీ శాఖ పరిధిలోని వ్యవహారాల్లో రెవెన్యూ శాఖ జోక్యం ఎకువ అవుతున్నదని, ఇది సరికాదని తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి ఒత్తిడి తెస్తున్నారంటూ పట్టాలిస్తే అంగీకరించబోమని స్పష్టంచేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం రాజారాం గ్రామంలో అటవీ శాఖ అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ ఎం విట్టల్ విట్టు మరో 8 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- రెవెన్యూ శాఖకు హైకోర్టు హెచ్చరిక
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అటవీ భూముల్లో రెవెన్యూ శాఖ జోక్యం చేసుకోరాదని హైకోర్టు హెచ్చరించింది. అటవీ శాఖ పరిధిలోని వ్యవహారాల్లో రెవెన్యూ శాఖ జోక్యం ఎకువ అవుతున్నదని, ఇది సరికాదని తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి ఒత్తిడి తెస్తున్నారంటూ పట్టాలిస్తే అంగీకరించబోమని స్పష్టంచేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం రాజారాం గ్రామంలో అటవీ శాఖ అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ ఎం విట్టల్ విట్టు మరో 8 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ చేపట్టి అటవీ భూముల్లో జోక్యం చేసుకోవడం రెవెన్యూ శాఖకు అలవాటుగా మారిందని అన్నారు.
అటవీ భూముల్లో జోక్యం చేసుకునే అధికారం కలెక్టర్‌కు లేదని, పట్టాలు ఇవ్వాలంటూ కార్యనిర్వాహక వ్యవస్థలో అత్యున్నత అధికారి ఆదేశించినా ఈ కోర్టు అంగీకరించదని స్పష్టంచేశారు. అటవీ భూములకు పట్టాల జారీ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌ను ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

