పుస్తక సమీక్ష
ఆరోగ్యానికి అసలు మాత్ర ఆహారమే. అందుకే వంటిల్లే ఆరోగ్యాలయం అంటుంది సంప్రదాయ వైద్యం. అయితే వంటింట్లో అన్నీ వండి మాత్రమే తినాలా... వండకుండా కూడా పాకాన్ని చేయొచ్చా... అలా అయితే అది ఆరోగ్యదాయకం, ఆమోద యోగ్యమేనా... లాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తి, వాటికి సమాధానాలూ చెబుతుంది ‘వంద వండని వంటలు’ పుస్తకం. ఇంకా చెప్పాలంటే పచ్చి కూరల్లోని పోషకాలు వండితే చచ్చిపోతాయనీ, అది జీవశక్తి లేని మృతాహారం కిందకి వస్తుందనీ, అసలైన అమృత ఆహారం వండని వంటలేననీ అంటారు రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి.
వండని వంట… ఆరోగ్యపు పంట!
ఆరోగ్యానికి అసలు మాత్ర ఆహారమే. అందుకే వంటిల్లే ఆరోగ్యాలయం అంటుంది సంప్రదాయ వైద్యం. అయితే వంటింట్లో అన్నీ వండి మాత్రమే తినాలా… వండకుండా కూడా పాకాన్ని చేయొచ్చా… అలా అయితే అది ఆరోగ్యదాయకం, ఆమోద యోగ్యమేనా… లాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తి, వాటికి సమాధానాలూ చెబుతుంది ‘వంద వండని వంటలు’ పుస్తకం. ఇంకా చెప్పాలంటే పచ్చి కూరల్లోని పోషకాలు వండితే చచ్చిపోతాయనీ, అది జీవశక్తి లేని మృతాహారం కిందకి వస్తుందనీ, అసలైన అమృత ఆహారం వండని వంటలేననీ అంటారు రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి.
ఆయన మిద్దె తోటలు, పెరటి తోటల పెంపకాన్ని ఉద్యమంలా తీసుకుపోతూ సేంద్రియ కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు. అలాంటి కూరగాయలూ, ధాన్యాలూ, ఇతర దినుసులతో పొయ్యి మీద పెట్టకుండా వండగలిగే వంద వంటల్ని ఫేస్బుక్లో ప్రత్యేక శీర్షిక ద్వారా సేకరించి ముద్రించారారు. వీటిలో కొన్ని తానూ రాశారు. ఇందులో కూరలు, పచ్చళ్లు, పొళ్లు, స్వీట్లు, పానీయాలు… ఇలా అన్నీ ఉన్నాయి. హై క్యాల్షియం కూలింగ్ షేక్, మల్టీ గ్రెయిన్ ప్రొటీన్ ఐస్క్రీమ్, చియా ఫుడ్డింగ్లాంటి ఆసక్తికర రుచులూ పరిచయం చేశారు. అటు పనిని తగ్గిస్తూ ఇటు ఆరోగ్యాన్ని పెంపొందించే ఈ వంటల గురించి తెలుసుకోవడం ఎవరికైనా అవసరమే!
వంద వండని వంటలు
సంపాదకులు: తుమ్మేటి రఘోత్తమ రెడ్డి
పేజీలు: 134, వెల: రూ.300
ప్రతులకు: రైతునేస్తం పబ్లికేషన్స్, హైదరాబాద్.
ఫోన్: 96767 97777, 72070 45979
-లక్ష్మీహరిత ఇంద్రగంటి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

