సోల్ (దక్షిణ కొరియా): డేవిస్ కప్ టోర్నమెంట్ నూతన ఫార్మాట్లో తొలిసారి నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించాలనుకున్న భారత టెన్నిస్ జట్టు ఆశలు అడియాశలయ్యాయి. క్వాలిఫయర్ రౌండ్ పోరులో భారత్ 1-3తో కొరియా చేతిలో చిత్తయింది.
తొలి రోజు రెండు సింగిల్స్‌లో ఓడిన తర్వాత శనివారం జరిగిన కీలక డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ-దక్షిణేశ్వర్ 6-3, 3-6, 6-3తో నామ్ సంగ్- యు సంగ్ జంటపై గెలిచి జట్టును రేసులో నిలిపారు. కానీ, రివర్స్ సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 1-6, 2-6తో సున్వూ క్వాన్ చేతిలో చిత్తవడంతో కొరియా నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ ఓటమితో భారత్ 2027లో మళ్లీ క్వాలిఫయర్ రౌండ్-1 నుంచే డేవిస్ కప్ ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.